మోస్ట్ వయొలెంట్ ‘సలార్’

by Anukaran |   ( Updated:2020-12-02 04:23:56.0  )
మోస్ట్ వయొలెంట్ ‘సలార్’
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ మరో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ప్రకటించాడు. డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ‘కేజీఎఫ్‌’ను మించిన సినిమా చేస్తున్నాడన్న గాసిప్స్‌కు ఎట్టకేలకు తెరదింపాడు. కేజీఎఫ్ మేకర్స్ అయిన హోంబలి ఫిల్మ్స్ రెండు రోజుల క్రితం బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ చేయబోతున్నామని ప్రకటించగా.. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కొలాబరేషన్ అని చాలా వార్తలు వెలువడ్డాయి. వాటిని నిజం చేస్తూ ఏకంగా టైటిల్, ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసిన మేకర్స్.. ‘ది మోస్ట్ వయొలెంట్ మెన్ సలార్‌’గా ఇంటెన్స్ లుక్ ప్రజెంట్ చేశారు. పవర్‌ఫుల్ ఐస్, గంభీరమైన మీస కట్టు, చేతిలో భారీ గన్‌.. టోటల్‌గా ఆకలిగొన్న చిరుతలా వేటాడేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తున్న ప్రభాస్ లుక్‌కు ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీలవర్స్ కూడా ఫిదా అయిపోయారు.

‘సలార్.. హింసకు పునర్నిర్వచనం ఇవ్వనున్నాడు. అత్యంత తెలివిగల క్రూరుడు.. వెన్నెముకలో భయం పుట్టించనున్నాడు, అత్యంత హింసాత్మక ఘటనకు సాక్ష్యం ఇవ్వనున్నాడు’ అంటూ ప్రభాస్ లుక్‌ను షేర్ చేయగా.. అభిమానులు ఆనందంతో పండుగ చేసుకుంటున్నారు.

Advertisement

Next Story