నా చావుకు కారణం UV క్రియేషన్స్ .. ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ లెటర్ వైరల్

by Shyam |   ( Updated:2021-11-12 05:15:24.0  )
నా చావుకు కారణం UV క్రియేషన్స్ .. ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ లెటర్ వైరల్
X

దిశ, సినిమా : హీరోలు పూర్వజన్మలో అదృష్టం చేసుకుని ఉంటారు. అందుకే తమ కోసం చంపడానికైనా, చావడానికైనా రెడీ అయ్యే వీరాభిమానులను సంపాదించుకుంటారు. ఇలాంటి కేటగిరిలో ప్రభాస్ ముందుండగా.. తనను బిగ్ స్క్రీన్‌పై చూసి సంతోషించే భాగ్యం కోసం అనుక్షణం పరితపిస్తుంటారు అభిమానులు. అయితే 2019లో ‘సాహో’ తర్వాత ఇప్పటి వరకు ప్రభాస్ సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. కరోనా దీనికి కారణం కావచ్చు కానీ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ‘రాధే శ్యామ్’ మూవీ నుంచి కనీసం అప్‌డేట్స్ కూడా రాకపోవడంపై అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తన చావు చూసైనా సరే యూవీ క్రియేషన్స్.. ప్రభాస్ ‘రాధే శ్యామ్’ అప్ డేట్ ఇస్తుందేమోననే ఆశతో ఓ అభిమాని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఉన్న సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

‘సార్.. ఇంతవరకు ఒక లెటర్ కూడా రాయని నేను సూసైడ్ నోట్ రాస్తానని కలలో కూడా అనుకోలేదు. మీరు అప్‌డేట్స్ ఇవ్వకపోవడం వల్ల రాయక తప్పడం లేదు. కనీసం నా చావు చూసైనా ‘రాధే శ్యామ్’ అప్‌డేట్ ఇస్తారని అనుకొంటున్నాను. చాలా రోజులు వేచి చూసేలా చేశారు. మేము వెయిట్ చేశాం. ఇక చాలు సార్’ అంటూ రాసిన ఆ సూసైడ్ నోట్ ఇప్పటికే వైరల్ కాగా.. ఇప్పుడైనా యూవీ క్రియేషన్స్ అప్‌డేట్ ఇస్తుందో లేదో చూడాలి మరి.

కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నలకు తడబడిన ఆలియా.. వీడియో వైరల్

Advertisement

Next Story