విద్యుత్ స్తంభం విరిగిపడి.. యువకుడు మృతి

by Sumithra |
విద్యుత్ స్తంభం విరిగిపడి.. యువకుడు మృతి
X

దిశ, మెదక్: విద్యుత్ ట్రాన్స్ఫర్మర్ మరమ్మత్తు చేస్తుండగా స్తంభం విరిగిపడి యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని హవేలి‌ఘనపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ శేఖర్‌రెడ్డి వివరాల ప్రకారం.. హవేలిఘనపూర్ గ్రామానికి చెందిన ఓ రైతుకు సంబంధించిన బోరుబావుల్లో విద్యుత్త్ సరఫరా చేసే ట్రాన్స్ఫర్మర్ మరమ్మతులు చేయాలని లైన్మెన్ సాయిలుకు చెప్పారు. ఈ క్రమంలో కరెంట్ పనుల్లో సహాయంగా ఉంటాడని మెదక్ పట్టాణానికి చెందిన నవీన్(23) అనే యువకున్ని తీసుకెళ్లారు. నవీన్ స్తంభం పైకి ఎక్కి దిగుతున్న సమయంలో స్తంభం విరిగి సరిగ్గా అతడి మీద పడడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. దీంతో తల్లిదండ్రుల రోధనలతో గ్రామం మొత్తం కన్నీటి పర్యంతమయ్యింది.

Advertisement

Next Story

Most Viewed