ఆ అందానికి అడ్డుపడుతున్న విద్యుత్ శాఖ.. ఎలానో తెలుసా ?

by Shyam |   ( Updated:2021-10-22 03:20:08.0  )
ఆ అందానికి అడ్డుపడుతున్న విద్యుత్ శాఖ.. ఎలానో తెలుసా ?
X

దిశ, జనగామ: ఎంతో ప్రతిష్టాత్మకంగా రోడ్డుకిరువైపులా నాటిన మొక్కలు నేడు చెట్టుగా పెరిగాయి. ఇలా ప్రాణం పోసుకున్న చెట్లను పూర్తి స్థాయిలో పెరగనివ్వ కుండా విద్యుత్ శాఖ అధికారులు సగంలోనే నరికేసి చంపేస్తు న్నారు. ఈఘటన జనగామ జిల్లాలో అధికంగా జరుగుతున్నది. ఈవిషయంపై వివరాలిలా ఉన్నాయి.. రాష్ట్ర వ్యాప్తంగా జనగామ జిల్లాలో అటవీ సంపద తక్కువగా ఉన్నదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమంలో అధికారులు నాటిన మొక్కలు నేడు చెట్లుగా పెరిగి రోడ్డుకు ఇరువైపులా అందంగా కనబడుతున్నాయి.

ఈ అందాన్ని పూర్తిస్థాయిలో కనబడనివ్వకుండా ఎవరు లేని సమయంలో విద్యుత్ వైర్లకు అడ్డుగా ఉన్నాయని చెట్లను నరికేస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు. ఇట్టి సంఘటన ఇటీవల జనగామ చిటకోడూరు రోడ్డులో జరిగింది. ఈ విషయంపై ప్రభుత్వ పనితీరును, విద్యుత్ శాఖ పని తీరును పలువురు విమర్శిస్తున్నారు. మొక్కలు పెంచమని ఒకరు కృషి చేస్తే, విద్యుత్ వైర్లకు చెట్లు అడ్డంగా ఉన్నాయని మరొకరు ఇష్టారాజ్యంగా చెట్లను పెరగనీయకుండా చేస్తున్నారని జిల్లా ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇట్టి విషయంపై జిల్లా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Next Story