ఆగష్టులో 6 శాతం తగ్గిన విద్యుత్ డిమాండ్

by Harish |
ఆగష్టులో 6 శాతం తగ్గిన విద్యుత్ డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆగష్టు తొలి రెండు వారాల్లో విద్యుత్ డిమాండ్ (Electricity demand) 5.6 శాతం మేర క్షీణించిందని విద్యుత్ మంత్రిత్వ శాఖ (Ministry of Power) గణాంకాలు వెల్లడించాయి. జులైలో 2.61 శాతం డిమాండ్ (Demand) పడిపోయిన దానికి ఇది అదనం. ఆగష్టు నెల తొలి రెండు వారాల్లో విద్యుత్ డిమాండ్ 167.49 గిగా వాట్స్ (Giga watts)గా ఉంది.

గతేడాది ఇదే నెలలో ఇది 177.52 గిగావాట్స్‌ (Giga watts)గా నమోదైంది. అంటే, గతేడాదితో పోలిస్తే ఈసారి 5 శాతం క్షీణించింది. ఇక, గతేడాది జులై నెలలో విద్యుత్ డిమాండ్ (Electricity demand) 175.12 గిగావాట్స్ (Giga watts)ఉండగా, ఈసారి 2.61 శాతం తగ్గింది. ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలను సడలించిన అనంతరం మే నెల నుంచి విద్యుత్ డిమాండ్ స్థిరీకరించబడినట్టు నిపుణులు చెబుతున్నారు.

2025, మార్చి చివరి నాటికి కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్రం లాక్‌డౌన్ (lock down) విధించింది. ఈ కారణంగానే వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ వినియోగం (Commercial and industrial power consumption) భారీగా క్షీణించింది. దీంతో డిమాండ్ (Demand)కూడా అదే స్థాయిలో తగ్గిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలతో ఏప్రిల్ నెలలో విద్యుత్ డిమాండ్ ఏకంగా 25 శాతం పడిపోయిన సంగతి తెలిసిందే.

మే చివరి నుంచి లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుతో వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాల (commercial and industrial activities) కోసం విద్యుత్ డిమాండ్ (Demand)క్రమంగా మెరుగుపడుతోంది. జూన్‌లో విద్యుత్ డిమాండ్ 9.6 శాతం క్షీణతతో 164.98 గిగావాట్స్ (Giga watts)ఉండగాం, గతేడాది ఇదే నెలలో 182.45 గిగావాట్స్‌గా నమోదైంది. అదేవిధంగా, దేశంలో విద్యుత్ వినియోగం మే నెలలో 14.86 శాతంగా నమోదైనట్టు విద్యుత్ మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి.

Advertisement

Next Story

Most Viewed