- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పండుగ, పుట్టినరోజులంటూ తాత్సారం
దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ ‘ఎంతెంత దూరం… ఇంకెంత దూరం’ అన్నట్టుగానే సాగుతూనే ఉంది. రేపు.. మాపు… పుట్టినరోజు కానుక… పండుగ కానుక అంటూ నానుస్తూనే ఉన్నారు. మరోవైపు పార్టీ నేతలు బీజేపీ వైపు లైన్ కడుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రస్థాయి నేతలు, జిల్లా నేతలకే పరిమితమైన వలసలు ఇప్పుడు ఎమ్మెల్యే వరకూ చేరుకున్నాయి. టీపీసీసీ పదవి కోసం తీవ్రంగా పోటీపడుతున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతానని ప్రకటించారు. ఇది వెంకట్‌రెడ్డికి తలనొప్పి వ్యవహారంగానే మారింది. నిజానికి కొన్నేండ్లుగా వీరిద్దరి మధ్య సయోధ్య లేదు. పలు అంశాలలో రాజీ కుదరడం లేదు. సోదరుడే పార్టీని వీడుతుండం పోటీదారులకు కలిసి వస్తోంది. రేవంత్‌రెడ్డిని సీనియర్లు అడ్డుకుంటున్నారు. దీంతో టీపీసీసీ వ్యవహారం మరింత ముదురుతోంది.
ఇక సంక్రాంతి వాయిదా
గ్రేటర్ ఎన్నికల తర్వాత టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ రాజీనామా చేశారు. ఇది మూడో రాజీనామా. గతంలోనే రెండు సందర్భాలలో ఉత్తమ్ కోర్ కమిటీకి రాజీనామా లేఖ ఇచ్చారు. ప్రస్తుతం ఉత్తమ్ నాయకత్వంపై అసంతృప్తి పెరిగింది. దీంతో మార్పు అనివార్యంగా మారింది. అధిష్టానం ఆదేశాలతో ఏఐసీసీ దూత మాణిక్కం ఠాగూర్ కూడా అభిప్రాయాలను సేకరించారు. 168 మంది నేతలతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్లు, డీసీసీ అధ్యక్షులు, ఎన్నికలలో పోటీ చేసినవారి అభిప్రాయాలన్నీ తీసుకున్నారు. బంతి అధిష్టానం కోర్టులో పడింది. ఎటూ తేలకుండా ఉంటోంది.
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పేరు ఖరారైనట్లు ప్రచారం జరిగింది. రేసులో రేవంత్‌రెడ్డి, వెంకట్‌రెడ్డితో పాటుగా దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు ముందున్నారు. రేవంత్‌రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నాయని భావించారు. మొదట రేవంత్ పుట్టినరోజు కానుక అన్నారు. ఆ తర్వాత సోనియాగాంధీ జన్మదినం, క్రిస్మస్ బహుమతి, పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటూ సాగదీసి చివరకు న్యూ ఇయర్ గిఫ్ట్ అంటూ చెప్పుకొచ్చారు. 2021 వచ్చింది. ప్రకటన మాత్రం రాలేదు. ఇపుడు సంక్రాంతికి టీపీసీసీ చీఫ్ ఎంపిక అని చెబుతున్నారు.
సెటైర్ల మీద సెటైర్లు
కాంగ్రెస్ పార్టీ వ్యవహారంపై తీవ్రస్థాయిలో సెటైర్లు పడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు సీఎం కేసీఆర్ అనుమతి కోసం అధిష్టానం ఆలోచిస్తోందని, అందుకే ప్రకటించడం లేదని పార్టీ నేతలే వెటకారమాడుతున్నారు. బీజేపీ అధికార పార్టీతోపాటు కాంగ్రెస్ నేతల జాబితా పట్టుకుని తిరుగుతోంది. ఈ సమయంలో రేవంత్‌రెడ్డికి టీపీసీసీ పగ్గాలు ఇస్తే కొంతమంది, ఇవ్వకుంటే మరికొంతమంది, వెంకట్‌రెడ్డికి వస్తే కొంతమంది పార్టీ నుంచి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. ఎలాంటి ప్రచారం జరిగినా కాంగ్రెస్ పార్టీ మాత్రం స్పందించడం లేదు.
అటు సీనియర్లు… ఇటు తమ్ముడు
కాంగ్రెస్ పార్టీకి సొంత నేతలే అడ్డుగా మారుతున్నారనే చర్చ సాగుతోంది. రేవంత్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్ ఇస్తే సీఎం కేసీఆర్‌ను దీటుగా ఎదుర్కొంటారని ప్రచారం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డికి ఎలా ఇస్తారంటూ వీహెచ్, జగ్గారెడ్డి వంటి సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. పార్టీలో ముందు నుంచి ఉన్న నేతలకు, బీసీలకు ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నారు. రేవంత్‌రెడ్డికి ఇస్తే పార్టీలో ఉండబోమని హెచ్చరిస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి అధిష్టానాన్ని కలిసే ప్రయత్నాలు చేస్తున్నా సోనియా, రాహుల్ అప్పాయింట్మెంట్ దొరకడం లేదు. సీఎల్పీ నేత భట్టి మౌనంగా ఉంటున్నారు. కోమటిరెడ్డికి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం అడ్డుగా మారుతోంది. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను మల్లు రవి తీవ్రంగా ఖండించారు. ప్రజలు ఇబ్బందులలో ఉన్నప్పుడు నిలబడే పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని, కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు.