- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘మున్సిపల్ ఎన్నికలు’ వాయిదా వేయండి..
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరగాల్సిన బై ఎలక్షన్‌ని కరోనా కారణంగా వాయిదా వేశారని, ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకొని రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని తెలంగాణ కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ కోర్డినేషన్ కమిటీ కన్వీనర్ నిరంజన్ ఎన్నికల కమిషనర్ పార్థసారధికి శనివారం లేఖ రాశారు. ఎన్నికల సమయంలో ప్రజలు గుమిగూడాల్సిన పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. దీని ద్వారా వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. తద్వారా ప్రజలు, పోలింగ్ సిబ్బంది, పార్టీల ఏజెంట్లు, వివిధ పార్టీల కార్యకర్తలు అందరికీ ప్రమాదమని తెలిపారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలను వెంటనే వాయిదా వేయాలని కోరారు.
Next Story