- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీరు ఆ స్కీమ్‌లో ఉన్నారా.. 7 లక్షలు మీ సొంతం..
దిశ, వెబ్‌డెస్క్ : పోస్టాఫీస్‌లో ఎన్నో రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నప్పటికీ చాలా మందికి వాటి గురించి తెలియదు. దీంతో డబ్బులు ఇన్వెస్ట్ చేసేందుకు ఎవరూ ముందుకు రారు. అయితే పోస్టాఫీస్‌లో డబ్బులు దాచుకోవాలి అనుకునే వారి కోసం ఓ ప్రత్యేక స్కీమ్ ఎదురుచూస్తోంది. ఆ స్కీమ్ ఏంటంటే..
పోస్టాఫీస్‌లో టైమ్ డిపాజిట్ స్కీమ్ ఒకటుంది. ఇందులో ఏడాది నుంచి ఐదేళ్ల కాల పరిమితితో డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 6.7 శాతం వరకు వడ్డీ వస్తోంది. రూ.1000 ఉన్నా కూడా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది.
ఐదేళ్ల కాల పరిమితితో ఈ స్కీమ్‌లో చేరితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80(C)కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందొచ్చు. నామినేషన్ సదుపాయం ఉంది. మీరు ప్రతీ సంవత్సరం వడ్డీ డబ్బులు పొందొచ్చు. పిల్లల పేరుపై కూడా ఈ అకౌంట్ తెరిస్తే.. గార్డియన్ కచ్చితంగా ఉండాలి.
ఉదాహరణకు మీరు ఈ స్కీమ్‌లో రూ.5 లక్షలు డిపాజిట్ చేశారు. వడ్డీ రేటు 6.7 శాతంగా ఉంది. మెచ్యూరిటీ కాలం 5 ఏళ్లు. మీరు మెచ్యూరిటీ సమయంలో చేతికి దాదాపు రూ.7 లక్షల వరకు వస్తాయి. వడ్డీ రూపంలో రూ.2 లక్షల వరకు ప్రయోజనం పొందొచ్చు.
- Tags
- post office