- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డీఏ నిలిపివేతపై తపాలా ఉద్యోగుల నిరసన
దిశ, నల్లగొండ: హుజూర్‌నగర్ ఉప తపాలా కార్యాలయం ఉద్యోగులు శుక్రవారం భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. తపాలా శాఖ క్లాస్ -3 ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షులు పెనుగొండ వెంకటేశ్వర్లు, గ్రామీణ డాక్ సేవకుల జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ లాక్‌డౌన్ సమయంలో ప్రజలంతా గడప దాటకపోయినా అత్యవసర సర్వీసుల కింద కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. తమకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిందిపోయి 18 నెలలపాటు డీఏను నిలుపుదల చేయడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. కొవిడ్ -19 నేపథ్యంలో పనిచేస్తున్న తపాలా ఉద్యోగులకు కూడా బీమా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తపాలా ఉద్యోగులు కిరణ్ కుమార్ రెడ్డి, మదన్ మోహన్, బత్తిని సునీల్ గౌడ్, సుశీల, వెంకయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Tags; Huzurnagar,post office staff,protest,Day