- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కన్నీరు పెట్టిస్తున్న కెన్యా తల్లి కథ!
దిశ, వెబ్‌డెస్క్:
కరోనా వైరస్ పేదల జీవితాన్ని కకావికలం చేసింది. తినడానికి తిండి గింజలు, చేయడానికి పని లేదు, ప్రభుత్వం చేసే సాయాలు సరిపోవడం లేదు. కానీ ఆకలి అలాగే ఉంది. సమస్యలు రెట్టింపు అవుతున్నాయి. తన ఆకలి సంగతి దేవుడెరుగు… కానీ బిడ్డల సంగతి? అందుకే ఓ కెన్యా తల్లి చేసిన పని ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తెప్పిస్తోంది. ఆమె చేసిన పని గురించి తెలిస్తే చలించని హృదయం అంటూ ఉండదు. ఇంతకీ ఆమె చేసిన పనేంటో తెలుసుకోవాలంటే చదవండి మరి!
కెన్యాలోని మొంబాసాలో పెనినా బహాతి కిట్సావో నివాసముంటుంది. ఆమెకు ఎనిమిది మంది పిల్లలు. పెనినాకు చదువు లేదు. నీళ్లు, కరెంటు వసతి లేని ఇంట్లో ఆమె నివాసం ఉంటుంది. భర్తను గతేడాది ఒక దొంగ చేతిలో చనిపోయాడు. అప్పట్నుంచి ఓ నాలుగు ఇళ్లలో బట్టలు ఉతికి పెనినా తన పిల్లలను పోషిస్తోంది. కానీ కరోనా వైరస్ కారణంగా సామాజిక దూరం వల్ల ఆమె పని పోయింది. పిల్లల ఆకలి మాత్రం అలాగే ఉంది. ఏడుగురు పిల్లలు పెద్దవారు.. ఇంట్లో తినడానికి ఏం లేదు అంటే అర్థం చేసుకున్నారు. కానీ సంవత్సరం వయసున్న ఎనిమిదో పాపకు ఏం చెప్పాలి?
అప్పుడే పెనినాకు ఒక ఉపాయం తట్టింది. వెంటనే ఒక గిన్నె తీసుకుంది. అందులో రాళ్లు వేసి నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టింది. అవి ఉడుకుతుండగా చూసిన ఆ పాప తన తల్లి ఏదో వండుతుందనే భ్రమతో ఆనందపడి ఏడుపు ఆపింది. అలాగే నవ్వుతూ నిద్రపోయింది.
ఈ హృదయ విదారక సంఘటన చూసిన పక్కింటి ప్రిస్కా మొమన్వి వీడియో తీసి మీడియాకు పంపి, ఒక బ్యాంకు ఖాతా కూడా తెరిచింది. అంతే కెన్యా మొత్తం పెనినా చేసిన పని వైరల్ అయింది. వెంటనే ఆమె పేరున డబ్బు సాయాలు ఉవ్వెత్తాయి. కెన్యా ప్రజలు చూపిస్తున్న ఔదార్యానికి పెనినా కళ్లు చెమ్మగిల్లాయి.
Tags: corona, covid, Kenya, rocks, poor, peninah, water, africa, stove, kids