‘శాకుంతలం’ కోసం తగ్గిన బుట్టబొమ్మ

by Shyam |   ( Updated:2020-12-23 06:36:49.0  )
‘శాకుంతలం’ కోసం తగ్గిన బుట్టబొమ్మ
X

దిశ, వెబ్‌డెస్క్: బుట్టబొమ్మ పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ అయిపోయింది. పట్టిందల్లా బంగారం అన్నట్లు చేసిన సినిమాలన్నీ హిట్ అయిపోతున్నాయి. దీంతో భామ రెమ్యునరేషన్ రూ.2 కోట్లకు చేరింది. అంటే బడా బ్యానర్లు తప్పా చిన్న నిర్మాతలకు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు.

గుణ శేఖర్ దర్శకత్వంలో వస్తున్న ‘శాకుంతలం’ సినిమా కోసం పూజను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అయితే తను అడిగినంత రెమ్యునరేషన్ మాత్రం ఇచ్చుకోలేమని చెప్పేశారట. బట్ గుణశేఖర్ చెప్పిన స్టోరికి ఇంప్రెస్ అయిన పూజ.. రెమ్యునరేషన్ తక్కువైనా పర్లేదని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ‘శాంకుంతలం’ ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ కావడంతో మూవీ బ్లాక్ బస్టర్ అయితే లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగేందుకు బేస్ అవుతుందనే ఆలోచనతో ఓకే చెప్పేసిందట.

Advertisement

Next Story