సమ్మర్‌ లుక్‌లో పిచ్చెక్కిస్తున్న బుట్టబొమ్మ..

by Shyam |   ( Updated:2021-12-06 22:23:44.0  )
సమ్మర్‌ లుక్‌లో పిచ్చెక్కిస్తున్న బుట్టబొమ్మ..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల జాబితాలో బుట్టబొమ్మ పూజా హెగ్దె పేరు టాప్‌లో ఉంటుంది. ‘అలా వైకుంఠపురములో’ సినిమాతో కుర్రకారుని ఫ్లాట్ చేసిన భామ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. భారీ బడ్జెట్ సినిమాలను ఓకే చేస్తూ ఫుల్ బిజీ అవుతోంది. లైఫ్ ఎంత బిజీ అయినా కాస్త విరామం అవసరం అన్న ఫార్ములాను అమ్మడు ఎక్కువ నమ్ముతుంది. అందుకనే ఇటీవల రాధేశ్యామ్ డబ్బింగ్ పూర్తి చేసుకొని వెకేషన్‌కు వెళ్లింది.

ఈ క్రమంలోనూ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తోంది. తన హాట్ ఫోటో షూట్‌తో అందరినీ కట్టిపడేస్తోంది. తాజాగా సమ్మర్ లుక్‌లో అమ్మడు షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ షికార్లు కొడుతున్నాయి. బ్లూ కలర్ టాప్‌తో, టోపీ పెట్టుకొని అమ్మడు నవ్వుతుంటే కుర్రకారు మతులు పోతున్నాయి. అమ్మడి అందానికి ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోలపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘మళ్లీ బుట్టబొమ్మ బుట్టలో పడిపోయాను, ఒక్కసారి చేతుల్లోకి తీసుకోవా అని, సమ్మర్ లుక్స్‌తో వింటర్‌లోనే సమ్మర్ తెచ్చేసిందీ అంటూ నెటిజన్స్ అమ్మడి అందాన్ని పొగిడేస్తున్నారు.

ఇదిలా ఉంటే పూజా హెగ్దె నటించిన సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రాధేశ్యామ్’, కొరటాల శివ దర్శకత్వంలో చిరు హీరోగా చేస్తున్న ‘ఆచార్య’, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ హీరోగా నటిస్తున్న ‘కబీ ఈద్ కబీ దివాళీ’ సినిమాలతో అమ్మడు ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://twitter.com/hegdepooja/status/1467563605570719746?s=20

Advertisement

Next Story