ఆ హీరోతో టైమ్ స్పెండ్ చేసేందుకు పరితపించిపోతున్న పూజ

by Shyam |
ఆ హీరోతో టైమ్ స్పెండ్ చేసేందుకు పరితపించిపోతున్న పూజ
X

దిశ, సినిమా : బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంది. ఈ టైమ్‌లో అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటిస్తున్న భామ.. ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టిన పూజ, సల్మాన్ ఖాన్‌తో కలిసి వర్క్ చేయాల్సి ఉంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కభీ ఈద్‌ కభీ దివాళి’ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే ఆయనతో వర్క్ చేసేందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉందన్న పూజ.. తనతో మాట్లాడాల్సింది చాలా ఉందని తెలిపింది. సల్మాన్‌తో సెట్స్‌లో ఎలాంటి విషయాలు మాట్లాడాలో ముందే ప్రిపేర్ చేసుకున్నానని, ఆ టైమ్‌ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలిపింది.

Advertisement

Next Story