‘పొన్నియిన్ సెల్వన్’ : స్వర్ణయుగం ప్రాణం పోసుకుంటుంది

by Shyam |
‘పొన్నియిన్ సెల్వన్’ : స్వర్ణయుగం ప్రాణం పోసుకుంటుంది
X

దిశ, సినిమా : ప్రముఖ దర్శకులు మణిరత్నం డైరెక్షన్‌లో వస్తున్న మ్యాగ్నమ్ ఓపస్ ‘పొన్నియిన్ సెల్వన్’ అప్‌డేట్ ట్రెండింగ్‌లో ఉంది. ‘స్వర్ణయుగం ప్రాణం పోసుకుంటుంది’ క్యాప్షన్‌తో బ్రాండెడ్ న్యూ పోస్టర్‌ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. కూల్ ట్యాగ్ ‘PS 1’తో టైటిల్ పోస్టర్ విడుదల చేసిన మేకర్స్.. కల్కి ‘పొన్నియిన్ సెల్వన్’ పుస్తకం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా రెండు భాగాలుగా విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే 75శాతం షూటింగ్ కంప్లీట్ కాగా.. హైదరాబాద్, మధ్యప్రదేశ్‌లో జరిగే షూటింగ్‌తో ప్రాజెక్ట్ పూర్తి కానుంది. మణిరత్నం, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2022లో విడుదల కానుండగా.. విక్రమ్, త్రిష, ఐశ్వర్యా రాయ్, మోహన్ బాబు, జయం రవి, విక్రమ్ ప్రభు, కార్తీ లాంటి ప్రముఖనటులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్‌’కు రవివర్మన్ సినిమాటోగ్రఫర్‌గా వర్క్ చేస్తున్నారు.

Advertisement

Next Story