- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థి నాయకుడికే ఓటేసి.. ఆ పార్టీలకు బుద్ధి చెప్పండి: పొన్నం
దిశ, వీణవంక: హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరు వెంకట్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం కాంగ్రెస్ తరఫున వీణవంకలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రచారం నిర్వహించారు. తొలుత మామిడాలపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు చేసి మామిడాలపల్లి, ఇప్పలపల్లి, చల్లురు గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. అనంతరం మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. నిరుద్యోగుల కోసం కొట్లాడే విద్యార్థి నాయకుడిని కాంగ్రెస్ పార్టీ బరిలో దింపిందన్నారు. 5 సంవత్సరాలకు ఓసారి వచ్చే ఎన్నికలు రెండున్నర సంవత్సరాలకే వచ్చాయని.. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు.
తెలంగాణ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయని అనుకుంటే కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని.. పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టలేదని, రైతులకు రుణమాఫీ జరగలేదని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రాలేదన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు వెయ్యి రూపాయలకు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. అందుకే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్ర భగవాన్ రెడ్డి, జునుతల మధుకర్ రెడ్డి, పోతుల తిరుపతి, యాదగిరి, సాహెబ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.