కేసీఆర్‌కు పొన్నాల లక్ష్మయ్య సవాల్

by Shyam |
కేసీఆర్‌కు పొన్నాల లక్ష్మయ్య సవాల్
X

బడుగు, బలహీనవర్గాల పట్ల కేసీఆర్‌కు ప్రేమలేదనీ, ఒకవేళ ఉంటే, టీఆర్ఎస్ పాలనలో ఆయా వర్గాల ప్రజలకు ఖర్చు చేసిన నిధులపై చర్చకు రావాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సవాల్ విసిరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రిజర్వేషన్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద సోమవారం నిరసనాకార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న పొన్నాల మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై కేంద్రంలోని బీజేపీ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుండటం శోచనీయమన్నారు. 1902నుంచే రిజర్వేషన్ల చరిత్ర ఉందన్నారు. బడుగు బలహీనవర్గాలకు ఖర్చుచేసిన నిధులపై చర్చించడానికి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.

Advertisement

Next Story

Most Viewed