మమ్ముల్ని కూడా ప్రమోట్ చేయండి !

by Shyam |
మమ్ముల్ని కూడా ప్రమోట్ చేయండి !
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొవిడ్ నేపథ్యంలో పరీక్షలు రాయలేక పోతున్నామని, తమను కూడా ప్రమోట్ చేయాలని కోరుతూ సోమవారం ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో పాలిటెక్నికల్ విద్యార్థులు సాంకేతిక విద్యాభవన్ ముందు ఆందోళనకు దిగారు. పది, ఇంటర్ విద్యార్థులను ప్రమోట్ చేసిన విధంగానే తమను కూడా ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బాల్మూరి వెంకట్ మాట్లాడుతూ ఈ ఆపత్కర సమయంలో విద్యార్థులకు పరీక్షలు లేకుండా పైతరగతులకు ప్రమోట్ చేయాలని కోరారు. ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులను అరెస్ట్ చేసి సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన నాయకులను తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు.

Advertisement

Next Story