- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల పోలింగ్ షురూ.. ఓటర్లు లేక వెలవెలబోతున్న పోలింగ్ కేంద్రాలు
దిశ ప్రతినిధి, కరీంనగర్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ 8 గంటలకు ప్రారంభమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 8 కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఓట్లు వేస్తున్నారు. సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటర్లు క్యాంపుల నుండి నేరుగా పోలింగ్ కేంద్రాలకు రావల్సి ఉన్నందున 10 గంటల తరువాత పోలింగ్ ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. 1,324 మంది ఓటర్లు ఇద్దరు ఎమ్మెల్సీలను ప్రాధాన్యత క్రమంలో ఎన్నుకోవాల్సి ఉంది.
కరీంనగర్ జడ్పీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వి కర్ణన్, పరిశీలకులు పి. విజయ్ కుమార్, సీపీ సత్యనారాయణలు పర్యవేక్షించారు. పెద్దపల్లిలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. కొవిడ్ ప్రొటొకాల్‌కు అనుగుణంగా పోలింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. పెద్దపల్లి, మంథనిల్లో రెండు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్‌లు చేయించిన తరువాతే బూత్‌లోకి అనుమతి ఇస్తున్నామని చెప్పారు. హెల్ప్ డెస్క్‌తో పాటు హెల్త్ డెస్క్‌లను కూడా ఏర్పాటు చేశామని వివరించారు.
ఇదిలా ఉండగా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మొదటి రెండు గంటల్లో అతి తక్కువ శాతం నమోదైంది. ఇప్పటి వరకు 8 పోలింగ్ కేంద్రాలలో 2.04 శాతం మాత్రమే పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.