- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Politics: దివంగత నేత వై.ఎస్. వివేకానందరెడ్డి చివరి కోరిక ఇదే.. వైఎస్ సునీత
దిశ వెబ్ డెస్క్: వై.ఎస్.వివేకానందరెడ్డి మరణించి ఇప్పటికి ఐదేళ్లు గడుస్తున్నా నేటికీ ఆయన పేరు వినిపిస్తూనే ఉంది. మొదటగా గుండెపోటుతో మరణించారని వార్తలు వచ్చినా.. ఆ తరువాత గొడ్డలితో నరకడం కారణంగా ఆయన చనిపోయారని తెలిసింది. అయితే మొదట టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చంపించారని నారసుర రక్త చరిత్ర అని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.
అయితే ఆ తరువాత వివేకా హత్యకు నారా చంద్రబాబు నాయుడుకి సంబంధం లేదని, వివేకాను హత్య చేసింది తన సోదరుడు ఎంపీ అవినాష్ రెడ్డి అని వివేకా కుమార్తె వైఎస్ సునీత ఆరోపించారు. నేటికీ న్యాయం కోసం ఆమె పోరాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ తన తండ్రి చివరి కోరికను ప్రజలకు తెలిపారు.
తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి తన అన్న కూతురు వైఎస్ షర్మిలను ఎంపీగా చూడాలనుకున్నారని, అదే ఆయన చివరి కోరిక అని తెలిపారు. తన తండ్రి చివరి కోరికను నెరవేర్చేందుకు తాను సన్నద్ధమైనట్టు పేర్కొన్నారు. హంతకులకు ఓటు వేయొద్దని ప్రజలను కోరారు. ఇక ఈ నెల 20వ తేదీన వైఎస్ షర్మిల ఎంపీగా నా నామినేషన్ దాఖలు చేస్తారని వెల్లడించారు.