- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్ పై అనర్హత వేటు.. కేసు పెట్టింది ఈయనే..!
దిశ, వెబ్ డెస్క్: మోడీ ఇంటి పేరు ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నిన్న సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష వేస్తూ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని ఎంపీగా అనర్హుడిగా ప్రకటిస్తూ ఇవాళ లోక్ సభ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కాంగ్రెస్ తో పాటు దేశంలోని విపక్షాలన్ని రాహుల్ పై అనర్హత వేటును ముక్తకంఠంతో ఖండించాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయంపై పోరాడేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా అసలు రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడటానికి కారణాలు, కేసు పెట్టిన వ్యక్తి ఎవరు అంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది.
అసలేం జరిగిందంటే..?
2019 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటకలోని కొలార్ లో నిర్వహించిన రోడ్డు షోలో పాల్గొన్నారు. అనంతరం అక్కడ నిర్వహించిన ఓ భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆయన ప్రధానీ మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల పేర్లన్నీ మోడీ పేరుతోనే ఎందుకు ఉన్నాయంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఆయన లలిత్ మోడీ, నీరవ్ మోడీ పేర్లను ప్రస్తావించారు. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పదించింది. రాహుల్ వ్యాఖ్యలు ఆయన అహంకారాని నిదర్శనమని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే గుజరాత్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ.. మోడీ ఇంటి పేరుతో ఉన్న వేల మందిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేశారు.
ఎవరీ పూర్ణేశ్ మోడీ..?
దేశంలో ప్రస్తుతం పూర్ణేశ్ మోడీ పేరు మారుమోగుతోంది. 2019లో మోడీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పోలీస్ కేసు పెట్టింది ఈయనే. పూర్ణేశ్ మోడీ సూరత్ లోని అదాజన్ ప్రాంతానికి చెందినవారు. ప్రస్తుతం ఈయన బీజేపీ తరఫున గుజరాత్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పూర్ణేశ్ మోడీకి ప్రధానీ నరేంద్ర మోడీ అంటే ఎంతో ఇష్టం. పూర్ణేశ్ కూడా ప్రధానీ మోడీ లాగే కష్టపడి పైకొచ్చారని పార్టీ కార్యకర్తలు చెబుతుంటారు. రోజూవారీ కూలీగా పని చేశారని, నరేంద్ర మోడీ లాగే టీ కూడా అమ్మారని అంటుంటారు. ఈ నేపథ్యంలోనే కష్టపడి చదివి పూర్ణేశ్ లాయర్ అయ్యారు. అనంతరం రాజకీయాల మీద ఉన్న ఆసక్తితో బీజేపీలో చేరారు. బూత్ కన్వీనర్, వార్డు ప్రముఖ్, బీజేపీ కార్పొరేటర్, స్టాండింగ్ కమిట్ చైర్మన్ , బీజేపీ సూరత్ అధ్యక్షుడిగా రెండు సార్లు.. ఇలా పలు పార్టీ, ప్రభుత్వ పదవుల్లో పని చేశారు.
2012లో సూరత్ పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్న కిషోర్ బాయి అకాల మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో పూర్ణేశ్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అనంతరం 2017, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా కూడా పని చేశారు. ప్రస్తుతం బీజేపీ తరఫున పశ్చిమ సూరత్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019లో రాహుల్ గాంధీ మోడీ ఇంటి పేరుతో ఉన్న తమను అవమానించేలా మాట్లాడారని ఆరోపిస్తూ ఆయనపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి ఐదేళ్లుగా సూరత్ కోర్టులో విచారణ జరుగుతోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి తీర్పును వెలువరించిన సూరత్ కోర్టు.. రాహుల్ ను దోషిగా నిర్ధారిస్తూ రెండేళ్ల జైలు శిక్ష వేసింది. ఈ తీర్పును ఆధారంగా చేసుకుని రాహల్ గాంధీని ఎంపీగా అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్ సభ ఉత్తర్వులు జారీ చేసింది.