Narayana: నేటికీ ఆ పాపం నారాయణను వెంటాడుతూనే ఉంది.. VSR

by Indraja |
Narayana: నేటికీ ఆ పాపం నారాయణను వెంటాడుతూనే ఉంది.. VSR
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. అటు బహిరంగ సభల్లోనూ ఇటు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు విమర్శల జల్లు కురిపించుకుంటున్నారు. తాజాగా నారాయణ విద్యాసంస్థల చైర్మన్, టిడిపి నేత పొంగూరు నారాయణను ఉద్దేశించి వైసీపీ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.

విద్యార్థుల ఆత్మహత్యల పాపం నారాయణను వెంటాడుతూనే ఉంటుంది అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అలానే పిల్లల ప్రాణాల మీద సంపాదించిన ఆస్తులు ఎన్ని ఉంటే ఏంటి నారాయణ గారు, పిల్లలను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసి చివరికి వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితిని కల్పించారని విజయసాయిరెడ్డి పోస్ట్ ద్వార ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలానే ఆ పాపం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది అని ఆయన పోస్ట్‌లో తెలిపారు. కాగా పొంగూరు నారాయణ రానున్న ఎన్నికల్లో టీడీపీ తరుపున నెల్లూరు నుండి పోటీ చేస్తున్నట్లు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆత్మహత్యకు సంబంధించిన ఓ కేసు తనపై ఉన్నట్లు ఆయన రిటర్నింగ్ అధికారికి అందించిన అఫిడివిట్‌లో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed