ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఘటనలో ఒకరు మృతి.. స్పందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు..

by Indraja |   ( Updated:2024-06-28 09:09:44.0  )
ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఘటనలో ఒకరు మృతి.. స్పందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు..
X

దిశ వెబ్ డెస్క్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాజదాని నగరం చిగురుటాకులా వనికిపోతోంది. డిల్లీలో కురిసిన ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షాలకు తెల్లవారు జామున 5.30 గంటల ప్రాతంలో ఢిల్లీ విమానాశ్రయంలో టెర్మినల్-1 పైకప్పులో కొంతభాగం కూలింది. విషయం తెలుసుకున్న ఎయిర్ పోర్టు అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీనా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

కాగా ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ ఈ ప్రమాదంలో చాలా వాహనాలు దెబ్బతిన్నాయి. కాగా ఈ ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు బటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అలానే ఈ ఘటనపై పూర్తి విచారణ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. కాగా ఈ ఘటనపై ఢిల్లీ ఎయిర్ పోర్టు ఓ ప్రకటన విడుదల చేసింది. టెర్మినల్ 1 నుండి బయల్దేరే అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేశామని, అలానే చెక్- ఇన్ కౌంటర్లను కూడా మూసివేశామని, ప్రయాణికులకు ఏర్పడిన అసౌకర్యానికి చింతిస్తున్నామని.. క్షమాపణలు కోరుతున్నామని మధ్యాహ్నం 2 గంటల వరకు ఇండిగో, స్పైస్ జెట్ విమానాలు రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థలు ప్రకటించాయి.

Advertisement

Next Story

Most Viewed