రాజగోపాల్‌ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే: కిషన్ రెడ్డి

by GSrikanth |   ( Updated:2022-08-20 11:06:56.0  )
రాజగోపాల్‌ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే: కిషన్ రెడ్డి
X

దిశ, మునుగోడు: కేసీఆర్ అరాచక, నియంత, కుటుంబ పాలనకు ఉప ఎన్నికల్లో చరమగీతం పాడాలని కేంద్రమంత్రి వర్యులు కిషన్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పీఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తలు సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి ఈ ఉపఎన్నిక వచ్చిందన్నారు. రాజగోపాల్ రెడ్డి చేరిక కోసం అమిత్ షా సభ ఏర్పాటు చేస్తే.. టీఆర్ఎస్ పార్టీ ఎందుకోసం సభ ఏర్పాటు చేసిందో ప్రజలకు తెలపాలన్నారు. గత ఎన్నికల్లో దళితులకు మూడెకరాల భూమి, సాగుకు పెట్టుబడి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదన్నారు. తెలంగాణ వస్తే దళిత ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు దళితున్ని ముఖ్యమంత్రి చేయకుండా మాట తప్పారన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో దళితుని ముఖ్యమంత్రిగా ప్రకటించే ప్రజల్లోకి రావాలని లేకపోతే ప్రజలు తిరుగుబాటు తప్పదన్నారు.


మునుగోడు ప్రజల అభివృద్ధికి వారి మీద ఉన్న విశ్వాసంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని, మళ్లీ రాజగోపాల్ రెడ్డి ఆశీర్వదించి గెలిపించాలన్నారు. కల్వకుంట్ల కుటుంబం కోట్ల కోసం, అధికారం కోసం తప్ప ప్రజల సంక్షేమం కోసం పట్టించుకోరు అన్నారు. మునుగోడు గడ్డపైన రాజగోపాల్ రెడ్డి గెలుపు తధ్యమని, టీఆర్ఎస్ అధినేతలు కుర్చీలు వేసుకొని కూర్చున్న బీజేపీ గెలుపు ఆపలేరన్నారు. ఈనెల 21న జరిగే అమిత్ షా సభకు మునుగోడు ప్రాంతంలోని ప్రజలు కుటుంబ సమేతంగా హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి, కంకణాల శ్రీధర్ రెడ్డి, దోనూరు వీరారెడ్డి, నూకల నరసింహారెడ్డి, బండారు ప్రసాద్, చింతల రామచంద్రారెడ్డి, నాయకులు వేదాంతం గోపీనాథ్, బొల్గురి రమేష్, కేవీ ఉదయ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed