AP Elections 2024: అప్పడు వైనాట్ 175... ఇప్పుడు సన్నగిల్లిన ఆశలు

by Disha Web Desk 3 |
AP Elections 2024: అప్పడు వైనాట్ 175... ఇప్పుడు సన్నగిల్లిన ఆశలు
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి పోలింగ్‌కు వారం రోజుల ముందు, ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం రోజురోజుకీ సన్నగిల్లుతుందంటూ వ్యాఖ్యానించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. వైనాట్ 175 అన్న నినాదంతో ఎన్నికల బరిలోకి దిగి, దేనికైనా సిద్ధం అంటూ సభలు నిర్వహించిన వైసీపీ ఇప్పుడు పోలింగ్‌పై ఆశలు వదిలేసుకుందా?

అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇష్టానుసారం అధికారులను మార్చేస్తున్నారని వైఎస్ జగన్ ప్రచారంలో భాగంగా సోమవారం జరిగిన రేపల్లె, మాచర్ల, బందరు సభల్లో మాట్లాడుతూ అన్నారు.

ఆన్ గోయింగ్ పథకాలను ఆపుతారా?

తెలుగుదేశం ఎన్నికల కమీషన్ మీద ఒత్తిడి తీసుకువచ్చి ఆన్ గోయింగ్ పథకాలను కూడా ఆపిస్తుందని అక్కసు వెళ్లగక్కారు. పేదలకు మంచి చేస్తున్న జగన్ వుండకూడదని కుట్రలు చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ సోమ్ము విడుదల చేసేందుకు ప్రభుత్వం అనుమతి కోరగా , పోలింగ్‌కు వారం రోజుల ముందు ఎందుకంటూ నిరకకరించింది. దీనిని జగన్ ప్రస్తావించారు.

మార్చి 6 న బటన్ నొక్కి ఇప్పుడా విడుదల?

రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే మార్చి 6 వ తేదీన ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కారు. అయితే, నిధులులేకపోవడం వల్ల డబ్బు జమ కాలేదు. తీరిగ్గా ఏప్రిల్ 19 న డబ్బు జమచేసేందుకు అనుమతివ్వాల్సిందిగా ఎన్నికల సంఘానికి ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి లేఖ రాశారు.

కాగా పోలింగ్‌కు వారం రోజులేసమయం ఉన్నందున ఎన్నికల తరువాత జమ చేసుకోవాలని, ఇప్పుడు కుదరదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే దీనిని ఇప్పుడు జగన్ ఎన్నికల అంశంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.

Next Story

Most Viewed