కాంగ్రెస్ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల

by GSrikanth |
కాంగ్రెస్ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్ కాంగ్రెస్ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదలైంది. మంగళవారం 56 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 151 మందిని ఏఐసీసీ ప్రకటించింది. కాగా, అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతుంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజస్థాన్‌లో అధికార పీఠాన్ని తిరిగి దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ.. ఎలాగైనా కాంగ్రెస్‌ను గద్దె దించి తాము అధికారంలోకి రావాలని బీజీపీ వ్యూహ ప్రతివ్యూహాలతో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే పోటా పోటీగా అభ్యర్థుల జాబితాలను ఇరు పార్టీలు విడుదల చేస్తున్నాయి.

Advertisement

Next Story