- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హస్తంకు వారసుల పోటు!
దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో ఈసారి ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత పార్టీ నేతలే షాక్ ఇస్తున్నారు. వరుసగా పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ గూటికి చేరుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు మొదటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న బీజేపీ తాజాగా అమలు చేస్తున్న వ్యూహం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ వారసత్వ పార్టీ అని తూర్పారబడుతున్న బీజేపీ తాజాగా హస్తం పార్టీలో ఉన్న వారసులపై దృష్టి సారించింది. కేరళకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనిని ఇటీవలే బీజేపీ నేతలు కండువా కప్పిన సంగతి మర్చిపోకముందే తాజాగా కర్ణాటకలో ఇలాంటి సీనే రిపీట్ అయింది. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ కాగోడు తిమ్మప్ప కూతురు డాక్టర్ రాజనందిని కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా కాగోడు తిమ్మప్ప రియాక్ట్ అయ్యారు. తన కూతురు పార్టీ మారిన వార్త ఇప్పుడు విన్నానని, ఇలా జరుగుతుందని తాను ఊహించలేదన్నారు. రాజనందిని పార్టీ మారడం వెనుక హర్తాళు హాలప్ప(బీజేపీ నేత) వ్యూహం అయి ఉంటుందని ఆరోపించారు. తన కూతురు రాజనందినితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తాను. తన కూతురు పార్టీ మారిన తాను మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతానని కాగోడు తిమ్మప్ప స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ లోని కీలక నేతల వారసులను బీజేపీలో చేర్చుకోవడం కమలనాధుల వ్యూహాత్మకం అయి ఉంటుందని, వారసులు ఓ పార్టీలో పేరెంట్స్ మరో పార్టీలో ఉండటం వల్ల కాంగ్రెస్ ను మరింత దెబ్బ తీయవచ్చనేది బీజేపీ ఆలోచనగా ఉందనే చర్చ జరుగుతోంది. మొత్తంగా తాజా పరిణామాలు హస్తం పార్టీలో వారసుల పోటుగా మారిందనే చర్చ జరుగుతోంది.