- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మద్యం బంద్ చేయాలని ఎక్సైజ్ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతల ధర్నా
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్నదని కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతను ఖరాబ్చేస్తున్న మద్యాన్ని వెంటనే బంద్పెట్టాలని డిమాండ్చేస్తూ టీ కాంగ్రెస్ రాష్ట్ర ఎక్సైజ్కార్యాలయం ముందు సోమవారం ధర్నాకు దిగింది. రాష్ట్రంలో మద్యం, డ్రగ్స్ విచ్చలవిడిగా వినియోగంతో నేరాలు పెరిగిపోతున్నాయని, మహిళలు,బాలికలపై న దాడులు, హత్యలు జరుగుతున్నా, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. మహిళలపై దాడులకు కారణమైన డ్రగ్స్, మద్యం న్ని వెంటనే నిషేదించాలని కాంగ్రెస్ పార్టీ కోరింది.
ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్, మెట్టు సాయి కుమార్, చరణ్ కౌశిక్ లు మాట్లాడుతూ.. తెలంగాణ లో మద్యం ఆదాయం విపరీతంగా పెరిగిపోయిందని, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణిస్తున్నాయని అన్నారు. డ్రగ్స్, మద్యం, గంజాయి తో యువకులు, పక్కదారి పడుతూ, భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం వారు అసిస్టెంట్ కమిషనర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.