Governor Tamilisai: ముగిసిన మహిళా దర్బార్.. గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2022-06-10 09:21:34.0  )
Governor Tamilisai holds mahila darbar in raj bhavan
X

దిశ, వెబ్‌డెస్క్: Governor Tamilisai holds mahila darbar in raj bhavan| గవర్నర్ తమిళిసై ఆధ్వర్యంలో రాజ్ భవన్‌లో నిర్వహించిన మహిళా దర్బార్ కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తున్నానని, ప్రజల పక్షాన బలమైన శక్తిగా ఉంటానని హామీ ఇచ్చారు. తెలంగాణ మహిళలను అన్ని విషయాల్లో అండగా ఉంటానని తెలిపారు. మహిళలు అడుగుపెట్టిన రంగంలో అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారని, మనమే గెలుస్తాం.. మనల్ని ఎవరూ ఆపలేరు అని వ్యాఖ్యానించారు. నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదని ఆనూహ్య వ్యాఖ్యలు చేశారు. మహిళలకు, ప్రభుత్వానికి వారధిలా ఉండాలని అనుకుంటున్నట్లు తెలిపారు. దీనికి ఎవరు ఎదురుచెప్పినా తాను పట్టించుకోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story