పదవులు లేకుండా నెల కూడా బతకలేని మీకు గాంధీ కుటుంబంతో పోలికా?: కేటీఆర్పై టీకాంగ్రెస్ ఫైర్

by Javid Pasha |   ( Updated:2023-06-28 13:49:54.0  )
పదవులు లేకుండా నెల కూడా బతకలేని మీకు గాంధీ కుటుంబంతో పోలికా?: కేటీఆర్పై టీకాంగ్రెస్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి కేటీఆర్ పై టీకాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. ‘‘పదవులు లేకుండా నెల కూడా బతకలేరు.. మీకు గాంధీ కుటుంబంతో పోలికా’’ అని మండిపడింది. ఈ మేరకు టీకాంగ్రెస్ కమిటీ ట్వీట్ చేసింది. పదేళ్లు అధికారంలో ఉన్నా.. పీఎం అయ్యే అవకాశం ఉన్నా ఏనాడు పదవులు ఆశించని వ్యక్తులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అని కొనియాడింది. పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వారిద్దరూ సాధారణ ఎంపీలుగానే ఉన్నారని గుర్తు చేసింది.

కానీ తమలాగా సందు దొరకగానే సీఎం పదవి,నీటిపారుదల శాఖ, ఐటీ శాఖ, మున్సిపల్ శాఖ, ఆర్థిక శాఖ, వైద్యశాఖలను వాటాలుగా పంచుకోలేదని కేటీఆర్ పై విరుచుకుపడింది. ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టే గాంధీ కుటుంబానికి కల్వకుంట్ల కుటుంబంతో పోల్చకోవడానికి కల్వకుంట్ల కుటుంబానికి సిగ్గుండాలని తెలంగాణ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement

Next Story

Most Viewed