- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌లో ఏకఛత్రాధిపత్యం.. ఖర్గేతో కలిసి రేవంత్ రెడ్డి భారీ స్కెచ్!
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ ప్రక్షాళనకు ఏఐసీసీ సిద్ధమవుతోంది. దాదాపు ఏడాదిన్నరగా టీపీసీసీ కార్యవర్గంతో పాటుగా జిల్లాపార్టీ అధ్యక్షుల మార్పుపై చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయి. దీనికోసం నాలుగు రోజులుగా టీపీసీసీ చీఫ్రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే మకాం వేశారు. మార్పులు, చేర్పుల జాబితాపై అటు కేసీ వేణుగోపాల్, మాణిక్కం ఠాగూర్‌తో చర్చిస్తున్నారు. కొన్ని మార్పులపై రేవంత్పట్టుపడుతున్నారు. దాదాపుగా సగం మేరకు జిల్లా అధ్యక్షులను మార్చేందుకు అవకాశాలున్నాయి. అంతేకాకుండా ముగ్గురు టీపీసీసీ వర్కింగ్ప్రెసిడెంట్లపైనా వేటు వేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనిపై వచ్చే నెల మొదటివారంలోగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.
రేవంత్టీం..!
రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ విభేదాల మధ్య అపసోపాలు పడుతోంది. పార్టీ నేతలు ఇస్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మునుగోడు ఓటమి ముసుగులో మరింత రెచ్చిపోతున్నారు. ఇటీవల సీనియర్లు వరుసగా వివాదాలకెక్కుతున్నారు. మాజీ మంత్రి శశిధర్‌రెడ్డి రాజీనామా చేసిన సందర్భంగా టీపీసీసీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయినా, టీపీసీసీ నుంచి ఒక్కరు కూడా రిప్లై ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో టీపీసీసీపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా వెంటనే ఘాటుగా రిప్లై ఇచ్చేందుకు తన వర్గం ఉండాలంటూ రేవంత్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే టీపీసీసీతో పాటుగా జిల్లా పార్టీ అధ్యక్షుల మార్పునకు ఏఐసీసీ ఆమోదం చెప్పినట్లు సమాచారం. దీనిలో భాగంగా జిల్లా అధ్యక్షులను మార్చడంతో పాటుగా టీపీసీసీ పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఖరారు చేసేందుకు రేవంత్‌రెడ్డి ఢిల్లీలోనే మకాం పెట్టారు. నాలుగు రోజుల నుంచి ఆయన ఢిల్లీలోని ఏఐసీసీ నేతలతో చర్చిస్తున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. దాదాపుగా 16 నుంచి 20 జిల్లాల పార్టీ అధ్యక్షులను మార్చే అవకాశాలున్నట్లు సమాచారం. వీరికి టీపీసీసీలో ఏదైనా పోస్టును ఇవ్వాలని భావిస్తున్నారు.
వాస్తవంగా రాష్ట్రంలో తన టీం కోసం రేవంత్ రెడ్డి ముందు నుంచే ప్లాన్ వేశారు. కానీ, పదవుల పంపకాలు ఇప్పుడే మొదలుపెడితే.. గ్రూపులు పెరిగిపోతాయని భావించారు. అయినప్పటికీ.. కొంతమంది జిల్లా అధ్యక్షులకు ఇన్ డైరెక్ట్ గా సంకేతాలు కూడా ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుతం టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో పాటుగా జిల్లా పార్టీ అధ్యక్ష స్థానాల్లో రేవంత్వర్గాన్ని నింపేందుకు జాబితా కూడా సిద్ధమైంది.
వర్కింగ్ప్రెసిడెంట్లపైనా వేటు
ప్రస్తుతం టీపీసీసీలో ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నా.. ఫాయిదా లేకుండా పోయింది. ఇటీవల రేవంత్ రెడ్డి జోడో యాత్రలోనూ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఫెయిల్యూర్‌ను మూటగట్టుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ముగ్గురిపై వేటు వేయాలని రేవంత్‌రెడ్డి ఏఐసీసీ నేతల దగ్గర విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గీతారెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్‌తో పాటుగా పార్టీకి అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న మహ్మద్అజారుద్దీన్ను టీపీసీసీ నుంచి పక్కన పెట్టాలని ఒత్తిడి తెస్తున్నారు. దీనికి ఏఐసీసీ నుంచి కూడా ఆమోదం వచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వచ్చేనెల మొదటివారంలోనే ఏఐసీసీ చీఫ్ఖర్గే ద్వారా ఈ జాబితాను విడుదల చేయించనున్నట్లు తెలుస్తోంది.
టీపీసీసీకి అనుబంధంగా..!
టీపీసీసీకి కొత్త కమిటీతో పాటుగా అనుబంధంగా పలు కమిటీలు వేసేందుకు నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ మేరకు డిసెంబర్4న ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్మాణిక్కం ఠాగూర్‌తో పాటుగా రేవంత్ రెడ్డి ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ సందర్భంగా మార్పులపై తుది నిర్ణయం రానుంది. పొలిటికల్ఎఫైర్స్ కమిటీ, కో ఆర్డినేషన్కమిటీతో పాటుగా ప్రచార కమిటీని సైతం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా మధుయాష్కీ కొనసాగుతున్నారు. అదేవిధంగా టీపీసీసీ పొలిటికల్ఎఫైర్స్కమిటీలో 12 మందికి ఈసారి అవకాశం ఇవ్వనున్నారు. గతంలో ఈ సంఖ్య కొంత ఎక్కువగానే ఉండేది. ఇప్పుడు మార్చుతున్నారు. డిసెంబర్4న ఖర్గేతో సమావేశం తర్వాత పూర్తిస్థాయిలో కమిటీలను ప్రకటించే అవకాశాలున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షులను మార్చిన నేపథ్యంలో ఈ కమిటీల్లో వారికి సర్దుబాటు చేయనున్నారు.