- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీలో చేరనున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రేమ్ కుమార్
దిశ, కూకట్పల్లి: కూకట్పల్లికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లా అధ్యక్షుడు హరీష్ రెడ్డితో కలిసి బుధవారం డిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గంలో రాజకీయాల గురించి సుధీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. రానున్న ఎన్నికలలో కూకట్పల్లిలో బీజేపీ జెండా ఎగరేసేందుకు రాష్ట్ర నాయకత్వం సైతం కూకట్పల్లి నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పార్టీ కార్యక్రమాలతో పాటు, ప్రజలలో బీజేపీ పార్టీని బలంగా తీసుకు వెళ్లడానికి చర్యలు తీసుకుంటుంది.
ఇప్పటికే నియోజకవర్గంలో బీజేపీ నాయకులు పాదయాత్రలు నిర్వహిస్తుంటే కూకట్పల్లిలో బలమైన సామాజిక వర్గంతో పాటు, ముమ్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సామాజిక కార్యకర్త, రియల్ ఎస్టేట్ వ్యాపారి బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకుంటుండటంతో నియోజకవర్గంలో రాజకీయ నాయకుల మధ్య గట్టి చర్చ నడుస్తుంది. కొన్ని రోజులలో తన మద్దతుదారులతో భారీ సభ నిర్వహించి బీజేపీ పార్టీలో చేరేందుకు ప్రేమ్ కుమార్ పావులు కదుపుతున్నట్టు, బీజేపీ అధిష్టానం సైతం ప్రేమ్ కుమార్ను పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించింది. కొన్నిరోజుల క్రితం రాష్ట్ర బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్ ప్రేమ్ కుమార్ నివాసానికి వచ్చి ఆతిథ్యం స్వీకరించారు. కిషన్ రెడ్డిని కలిసిన వారిలో జిల్లా అధ్యక్షుడు హరీష్ రెడ్డితో పాటు, మల్కాజిగిరి పార్లమెంట్ కో-కన్వీనర్ రాజు తదితరులు పాల్గొన్నారు.