- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విపక్షాల కూటమిపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: విపక్షాల ‘ఇండియా’ కూటమిపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం ఢిల్లీలో అధికార పక్ష కూటమి (NDA) సమావేశం అనంతరం ప్రధాని మిత్ర పక్షాలను ఉద్దేశించి మాట్లాడారు. దేశ ప్రగతిలో ఎన్డీఏ కూటమి పాత్ర అత్యంత కీలకమైనదని అన్నారు. ప్రజా వ్యతిరేక కూటములు ఎప్పుడూ సఫలం కావని విమర్శించారు. వచ్చే 25 ఏళ్లలో ఎన్డీఏ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతోందని తెలిపారు. దేశంలో స్థిరమైన పాలన అందించడానికే ఎన్డీఏ పనిచేస్తుందని వెల్లడించారు.
కాంగ్రెస్ కూటమి ప్రజా వ్యతిరేక కూటమి కడుతోందని విమర్శించారు. ఎన్డీఏ కూటమి ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేస్తుందని తెలిపారు. తాము ఎప్పుడూ కూడా విదేశీ శక్తుల సాయం తీసుకోలేదని అన్నారు. వారసత్వ రాజకీయాలతో ఏర్పడిన కూటమి ఎక్కువ రోజులు నిలవదు అని ఎద్దేవా చేశారు. అద్వానీయే ఎన్డీఏకు మార్గదర్శకులు అని తెలిపారు. ఎన్డీఏను నిర్మించింది వాయ్‌పేయి, అద్వానీయే అని అన్నారు. ఈ ఎన్డీఏ కూటమి 25 నుంచి దేశ ప్రజల సేవలో ఉందని వెల్లడించారు. కూటమిలో చేరిన కొత్త మిత్రులకు ఘన స్వాగతం పలికారు.