- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Raja Singh పై పీడీ కేసు.. ఎంఐఎం ప్రోద్బలమా? బీజేపీ కట్టడికా?
దిశ, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఓ ఎమ్మెల్యేపై తొలి పీడీ కేసు నమోదు అయింది. దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించారనే ఆరోపణలతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు పీడీయాక్టు పెట్టారు. రాజాసింగ్ ఓ మతాన్ని కించపరుస్తూ ఆరోపణలు చేశారనే అభియోగంతో కేసు పెట్టడం, ఎంఐఎం ఆందోళనలు చేపట్టడం పోలీసులు రంగంలోకి దిగడం అంతా చకచక జరిగాయి. బీజేపీ రాష్ట్రంలో పుంజుకుంటుండటంతో దానిని కట్టడిలో భాగంగా పీడీ యాక్టా? లేకుంటే ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు డైవర్షన్ కోసమా? అనేది హాట్ టాఫిక్‌గా మారింది.
ఎమ్మెల్యే రాజాసింగ్ పూర్వికులది ఉత్తరప్రదేశ్. అక్కడి నుంచి హైదరాబాద్ వలస వచ్చారు. గోషామహల్ లోని ధూల్ పేటలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. రియల్ ఎస్టేట్ ప్రధానమైనది. టీడీపీ కార్యకర్తగా రాజకీయ రంగప్రవేశం చేశారు. 2009లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీడీపీ నుంచి మంగళ్ హట్ డివిజన్ కార్పొరేటర్‌గా పోటీ చేసి విజయం సాధించారు. 2014 వరకు మంగళహట్ కార్పొరేటర్‌గా ఉన్నారు. ఆ తరుణంలో హైదరాబాద్ జూమెరత్ బజార్‌లో స్వాతంత్ర్య సమరయోధురాలు, రాణి అవంతి భాయ్ విగ్రహం తొలగింపు సంఘటనపై రాజాసింగ్‌పై కేసు నమోదైంది. తొలికేసు 2004లో నమోదు కాగా ఇప్పటివరకు 101 కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత రాజాసింగ్‌పై ఓ సారి హత్యాయత్నం కూడా జరిగింది. అక్కడి నుంచి ఓ వర్గాన్ని విమర్శిస్తూ తరచూ వార్తాల్లోకెక్కుతున్నారు. 101 కేసులల్లో 18 కేసులు మత విద్వేషాలు రెచ్చగొట్టే కేసులే. దేశ వ్యాప్తంగా 42 కేసులు నమోదు అయ్యాయి. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున గోషామహల్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.
రెండు పోలీసు స్టేషన్లలో రౌడీ షీట్లు
గోషామహల్ నియోజకవర్గం పరిధితో పాటు దేశ వ్యాప్తంగా రాజాసింగ్ పై కేసులు నమోదు అయ్యాయి. షాహినాయత్ గంజ్, మంగళ్‌హాట్ పోలీసులు రౌడీ షీట్లు ఉన్నాయి. అయితే 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాజాసింగ్ రౌడీషీట్లను తొలగింపజేయించుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. మతవిద్వేషాలు రెచ్చగొట్టే ఆరోపణలు చేయవద్దని ఇప్పటికే పోలీసులు సూచించినట్లు సమాచారం. అయితే ఈ నెల 23న మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. 41సీఆర్ పీసీ కింద నోటీసులు ఇవ్వలేదనే కోర్టు భావించి రాజాసింగ్ ను విడుదల చేసింది. తిరిగి షాహినాత్ గంజ్ పోలీసులు గురువారం 41 సీఆర్ పీసీ కింద నోటీసులు జారీ చేశారు. మంగళ్‌హాట్ పోలీసు స్టేషన్‌లో గతంలోనే రాజాసింగ్‌పై రౌడీషీట్ ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నడంతో పాటు గతంలో ఉన్న కేసులను ఆధారం చేసుకొని ఆయనపై పీడీ యాక్ట్ పెట్టినట్లు వెల్లడించారు.
ఎంఐఎం ప్రోద్బలమా? బీజేపీ కట్టడికా?
ఈ నెల20 హైటెక్ సిటీలోని శిల్పకళావేదిలో కామెడియన్ మునావర్ కామెడీ షో పెట్టారు. అయితే మునావర్ గతంలో హిందూదేవతలపై కించపరిచే వ్యాఖ్యలు చేయడంతో వివాదస్పదంగా మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ షోను అడ్డుకుంటామని రాజాసింగ్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పోలీసుల కట్టుదిట్టమైన భద్రత నడుమ షో నిర్వహించారు. ఈ తరుణంలో రెండ్రోజుల్లో సంచలనం చేస్తామని ప్రకటించిన రాజాసింగ్ ఈనెల 22వ తేదీన శ్రీరామ అనే యూట్యూబ్ చానల్‌లో రాజాసింగ్ విద్వేషాలు రెచ్చగొట్టేలా 10 నిమిషాల నిడివితో వివాదస్పద ప్రసంగాలు చేశాడంటూ ఆరోపణలు ఉన్నాయి. ఓ వర్గంకు వ్యతిరేకంగా అభ్యంతరకర వీడియోలను యూట్యూబ్ చానెల్‌లో అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించి తొలగింపజేయడంతో పాటు కేసు నమోదు చేశారు. కాగా ఈ వీడియోలపై ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
రాజాసింగ్ వీడియోపై దేశ, విదేశాల్లో వ్యతిరేకత వచ్చింది. దీనిపై అప్రమత్తమైన పోలీసులు నగరంలో లా అండ్ ఆర్డర్ అదుపుతప్పక ముందే రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయినా నిరసనలు కొనసాగుతుండటం, రాజాసింగ్ పై వేటు వేయాలని ఎంఐఎం స్పీకర్‌కు లేఖ రాయడం, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఘాటుగా స్పందించడంతో రాజాసింగ్ పై పీడీయాక్టు పెట్టారు. దీనిలో ఏమైన రాజకీయ కుట్రలు ఉన్నాయా అనే విమర్శలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీ రాష్ట్రంలో పుంజుకోవడంతో దానికి అడ్డుకట్ట వేయడానికే రాజాసింగ్ పై కేసులు పెట్టారా అనే అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. లేకుంటే ప్రజల్లో రోజురోజుకు వస్తున్న వ్యతిరేకతను కట్టడి చేయడానికే రాజాసింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారా? అనే చర్చ ప్రజల్లో హాట్ టాఫిక్‌గా మారింది. ఏదీ ఏమైనప్పటికీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్టు నమోదు కావడం ఇదే ప్రథమం.
ఏడాది వరకు జైలులోనే రాజాసింగ్?
పీడీ యాక్ట్ నమోదు చేయడంతో ఆయనకు ఏడాది పాటు జైలు జీవితం తప్పదా? అనే అనుమానం వ్యక్తమవుతున్నది. ప్రీవెన్సివ్ డిటెన్షన్ యాక్ట్ ఎందుకు నమోదు చేశామనే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి, న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టకుండానే నేరుగా జైలుకు తరలించే అధికారం పోలీసులకు ఉంటుంది. పదే పదే నేరాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగిస్తారు. అయితే ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ నమోదు చేయడం ఇదే తొలిసారి. పీడీ యాక్ట్ ను రివోక్ చేసే అధికారం హైకోర్టుకు ఉంటుంది. అయితే రాజాసింగ్ విషయంలో హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ రాజాసింగ్ పై కోర్టు న్యాయస్థానం పీడీ యాక్ట్ రివోక్ చేయకపోతే ఏడాది పాటు ఆయన జైలులోనే ఉండాల్సి ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.