- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రధాని మోడీతో భేటీ అనంతరం విపక్షాలకు షాకిచ్చిన ఒడిశా సీఎం
దిశ, డైనమిక్ బ్యూరో: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఓవైపు విపక్ష పార్టీలు ఏకతాటిపైకి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారాయి. థర్డ్ ఫ్రంట్ విషయంలో నవీన్ పట్నాయక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గురువారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన పట్నాయక్.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనకు సంబంధించినంత వరకు థర్డ్ ఫ్రంట్ వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. తాను ఒడిశాకు సంబంధించిన అంశాలపై ప్రధాని మోడీని కలిశానన్నారు. తమ రాష్ట్ర సమస్యలను పరిష్కరించే విషయంలో తప్పక సాయం చేస్తామని మోడీ భరోసా ఇచ్చినట్లు పట్నాయక్ తెలిపారు. అయితే ఓ వైపు బీజేపీకి వ్యతిరేకంగా బిహార్ సీఎం నితీష్ కుమార్ దేశంలోని విపక్ష పార్టీలను ఏకం చేసి వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని గద్దే దించడమే లక్ష్యంగా పని చేస్తున్న తరుణంలో తృతీయ ఫ్రంట్‌కు ఆస్కారమే లేదని పట్నాయక్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.