PM Narendra Modi Viral Photo: మనసును హత్తుకునేలా మోడీ ఫోటో వైరల్..

by Indraja |   ( Updated:2024-06-10 10:09:59.0  )
PM Narendra Modi Viral Photo: మనసును హత్తుకునేలా మోడీ ఫోటో వైరల్..
X

దిశ వెబ్ డెస్క్: దేశానికి రాజైనా అమ్మకు కొడుకే. ఎంత వయసు వచ్చినా అమ్మ ప్రేమ తనివితీరనిది. బిడ్డ ఓడిపోతే ధైర్యం చెప్పేది, గెలిస్తే అందరికంటే ఎక్కువ ఆనందించేది అమ్మ ఒక్కటే. అమ్మ ప్రేమ నిస్వార్థమైనది. అయితే దేశానికి రెండు సార్లు ప్రధానిగా సేవలందించి, ప్రజల మన్ననలు పొంది మూడవసారి సైతం ప్రధానిగా నరేంద్ర మోడీ ఎన్నికైన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో నిన్న ప్రధాని మోడీ ప్రమాణ స్వీకార మహోత్సవం రాష్ట్రపతి భవన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. కాగా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి అతిరథ మహారథులు అందరూ హాజరయ్యారు. హర్షద్వానాల మధ్య మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ.. మోడీ విజయాన్ని చూడడానికి ఆయన తల్లి ఇప్పుడు లేదు.

ఇటీవల ఆమె మరణించింది. గత ఎన్నికల్లో 300కి పైగా సీట్లను సాధించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు ఆయన తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు, అలానే ఆవిడ ప్రధాని మోడీ ప్రమాణస్వీకారం టీవీలో చూస్తూ ఎంతో మురిసిపోయారని సమాచారం. అయితే ఇప్పుడు ఆమె కాలం చేయడంతో ఈసారి ఆయన తన తల్లి ఆశీర్వాదాన్ని తీసుకోలేకపోయారు.

ఈ నేపథ్యంలో మోడీ తల్లి హీరాబెన్ ఆయన పక్కనే ఉన్నట్లు, ఆయనను అభినందిస్తున్నట్లు, ఆయన అభిమానులు ఓ ఫోటోను ఎడిట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed