అనిల్ సవాలును స్వీకరిస్తున్నా.. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి

by Javid Pasha |
అనిల్ సవాలును స్వీకరిస్తున్నా.. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
X

దిశ, నెల్లూరు: పెద్ద నోరు ఉంది కాబట్టే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనిల్‌కు సీఎం జగన్ మంత్రి పదవి ఇచ్చారని వైసీపీ బహిష్కృత ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మట్లాడుతూ.. తనతో పాటు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోతామని మాజీ మంత్రి అనిల్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నెల్లూరులో ఎవరి నోట విన్నా అనిల్ ఓడిపోతారనే చెబుతున్నారని, అలాంటి వ్యక్తి తపపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

తమ ముగ్గురిలో ఎవరు గెలిచినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాజీ మంత్రి అనిల్ చేసిన సవాలును తాను స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. తనతో పాటు ఆనం, కోటంరెడ్డిలు నూట ఒక్క శాతం కచ్చితంగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో గెలిచి తాము అసెంబ్లీలో అడుగు పెడితే అనిల్ సన్యాసం తీసుకోవాలని, ఒకవేళ అనిల్ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు.

Advertisement

Next Story