- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాంధీ కుటుంబంపై మోడీ కక్ష.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: గాంధీ కుటుంబంపై మోడీ కక్ష పెంచుకున్నారని, రాహుల్ సస్పెన్షన్నే దానికి ఉదాహరణ అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. దుర్మర్గమైన పాలనకు రాహుల్ సంఘటన నిదర్శనమన్నారు. బీజేపీ విధానాలు నీచమైనవన్నారు. కాలమే బీజేపీకి సమాధానం చెబుతుందన్నారు. మోడీ, అమిత్షా వైఖరితో ఆ పార్టీలోని లీడర్లే తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. అదానీ అంశంపై ప్రశ్నిస్తున్నందుకే రాహుల్ ను పార్లమెంట్ కు రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. ఇంతకంటే నీచం మరొకటి లేదన్నారు. రాహుల్ గాంధీకి ఎంపీ పదవి లేకపోయినా పెద్ద సమస్య కాదని, త్వరలోనే బీజేపీకి బుద్ది చెబుతామన్నారు. రాహుల్ కు పదవి లేకున్నా ఆ కుటుంబానికి దేశ ప్రజల అండ ఉంటుందన్నారు. కానీ మోడీకి పదవి లేకుంటే కనీసం సామన్య బీజేపీ కార్యకర్త కూడా సపోర్టు చేయడని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ పాదయాత్రను చూసి బీజేపీకి మైండ్ బ్లాక్ అయిందన్నారు. కేంద్రంలోని బీజేపీది క్రిమినల్ ప్రభుత్వం అని మండిపడ్డారు. రాహుల్ ను ఎందుకు సస్పెండ్ చేశామా? అని బీజేపీ లోని కొందరు లీడర్లు ఇప్పుడు ఫీల్ అవుతున్నారని జగ్గారెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. దేశం కోసం రాహుల్ కు మద్ధతు నిలవాల్సిన అవసరం ఉన్నదన్నారు. బీజేపీని తరిమికొట్టేందుకు మరో స్వతంత్ర పోరాటం చేయాలని పేర్కొన్నారు. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై లోక్ సభలో అనర్హత వేటు అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలన్నారు. భారత్ జోడో పాదయాత్ర ద్వారా ప్రజలను చైతన్యవంతం చేశారన్నారు. హిడెన్ బర్గ్ రిపోర్ట్ తర్వాత ఆదానీ, మోడీ కుంభకోణం బయటపడిందన్నారు. కోర్టు తీర్పు వచ్చి 24 గంటలు గడవకముందే రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం దారుణమన్నారు.