- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దెబ్బ అదుర్స్.. అధికారదర్పం చూపిన మిథున్ రెడ్డికి దిమ్మతిరిగే షాక్..
దిశ వెబ్ డెస్క్: ఈ రోజు మనదని ఎగిరెగిరి పడితే, రేపటి రోజున అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విషయంలో ఇదే జరిగింది. అసలు విషయానికి వస్తే వైసీపీ ప్రభుత్వ హయాంలో, మిథున్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు ఎంపీలుగా పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం వహించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే 2023 సెప్టంబర్ 9న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సిల్క్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయ్యారు.
ఈ నేపథ్యంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు చంద్రబాబు అరెస్ట్‌పై పార్లమెంట్‌లో ప్రస్తావన చేస్తున్న సమయంలో ఎంపీ మిథున్ రెడ్డి రామ్మోహన్ నాయుడు అవమానించారు. ఉన్నది లోక్ సభలో అనే విషయాన్ని విస్మరించి, సహచర ఎంపీ రామ్మోహన్ నాయుడుని పలు మార్లు రేయ్ అని సంభోదిస్తూ.. మాట్లాడింది చాల్లే కూర్చోమని అన్నారు.
నాడు అధికారదర్పంతో తోటి ఎంపీని, అదికూడా చట్టసభలో రేయ్ అని సంభోదించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఓడలు బళ్లు అవుతాయి బళ్లు ఓడలు అవుతాయి అన్నట్టు 2024 ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు, 4 పార్లమెంట్ స్థాలకు పరిమితమయ్యింది. కాగా వైసీపీ తరుపున మిథున్ రెడ్డిని రాజంపేట నుండి అతి తక్కువ మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు.
కాగా టీడీపీ 135 అసెంబ్లీ స్థానాలను 16 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంది. ఇక కూటమి పరంగా చూస్తే 164 అసెంబ్లీ స్థానాలను 21 పార్లమెంట్ స్థానాలను దక్కించుకోని భారీ మొజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీ తరుపున శ్రీకాకుళం నుండి కుంజరాపు రామ్మోహన్ నాయుడు భారీ మొజారిటీతో ఎంపీగా గెలుపొందారు.
ఈ నేపథ్యంలో ఆయనను పార్లమెంట్‌లో క్యాబినేట్ మంత్రిగా నియమిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే గతంలో రామ్మోహన్ నాయుడును రేయ్ అని సంభోదిస్తూ, అవమానించిన మిథున్ రెడ్డి ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఇప్పటికీ ఎంపీగానే ఉన్నారు. కానీ.. అవమానాలను ఎదుర్కొన్న రామ్మోహన్ నాయుడు క్యాబినేట్ మంత్రిగా నియమితులవుతున్నారని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరి కొంతమంది మిథున్ రెడ్డికంటే వయసులో చిన్నవాడైన రామ్మోహన్ నాయుడుక్యాబినేట్ మంత్రిగా బాధ్యతలు చేపడుతూ, ఆనాడు అవమానించిన మిథున్ రెడ్డికి తన విజయంతోనే సమాధానం చెప్పారని రామ్మోహన్ నాయుడుని కొనియాడుతున్నారు. రామ్ రామ్మోహన్ నాయుడు దెబ్బ అదుర్స్ అధికారదర్పం చూపి అవమానించిన మిథున్ రెడ్డికి రామ్ మోహన్ నాయుడు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారని ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.