ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కో కన్వీనర్ గా సుష్మా స్వరాజ్ కూతురు

by Javid Pasha |   ( Updated:2023-03-26 17:24:17.0  )
ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కో కన్వీనర్ గా సుష్మా స్వరాజ్ కూతురు
X

దిశ, వెబ్ డెస్క్: దివంగత బీజేపీ నాయకురాలు, ఢిల్లీ మాజీ సీఎం సుష్మా స్వరాజ్ కూతురు బాన్సూరి స్వరాజ్ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బీజేపీ ఢిల్లీ లీగల్ సెల్ కో కన్వీనర్ గా బాన్సూరి స్వరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా బాన్సూరి స్వరాజ్ మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించిన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్, వీరేంద్ర సచ్ దేవ్ తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. కాగా బాన్సూరి తల్లి సుష్మా స్వరాజ్ ఢిల్లీకి ఐదో ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పని చేశారు.

Advertisement

Next Story