- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కర్ణాటక రిజల్ట్స్ : స్వింగ్ స్టేట్‌లో కాంగ్రెస్ బౌన్స్ బ్యాక్
దిశ, వెబ్‌డెస్క్: అధికారంలో ఉన్న పార్టీకి షాక్ ఇచ్చే సంప్రదాయాన్ని ఈ సారి కూడా కన్నడిగులు కొనసాగిస్తున్నారు. స్వింగ్ స్టేట్ గా పేరున్న కర్ణాటకలో ఈ సారి అధికార పార్టీని కాదని హస్తం పార్టీకి ఓటర్లు జై కొట్టారు. 224 స్థానాల్లో 120 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగుతోంది. బీజేపీ 71 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలు చేజారి పోకుండా జాగ్రత్తలు పడుతోంది. వారిని మొదట తమిళనాడుకు తరలించేందకు ప్లాన్ చేస్తోంది. ఫలితాలు వెల్లడి నేపథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేతో చర్చలు జరుపుతోంది. అక్కడికి తమ ఎమ్మెల్యేలను తరలించేందుకు ప్లాన్ చేస్తోంది.
అధికార మార్పు ఇలా..
కర్ణాటకలో బీజేపీ ఎప్పుడూ అధిపత్య పార్టీగా కొనసాగలేదు. 1983 ఎన్నికల్లో 224 సీట్లలో బీజేపీ కేవలం 18 సీట్లను మాత్రమే గెలుచుకుంది. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ 82 సీట్లు సాధించింది. జనతా పార్టీకి 95 సీట్లు వచ్చాయి. అయితే 1994లో పరిస్థితులు మారి బీజేపీ 40 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి సెకండ్ ప్లేస్ లో నిలిచింది. 1999 నుంచి ప్రధానం బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యే పోటీ నెలకొంది. 2004 లో బీజేపీ 79 సీట్లు, కాంగ్రెస్ 65 సీట్లు గెలుచుకున్నాయి. 2008లో బీజేపీ ఏకంగా 110 సీట్లు గెలుచుకుంది.
2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. 122 సీట్లు గెలుచుకుని హస్తం పార్టీ మళ్లీ కర్ణాటకలో పాగా వేసింది. 2018 ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లతో తిరిగి అధికారాన్ని నిలుపుకుంది. కాంగ్రెస్ పార్టీ 78 సీట్లు గెలుచుకుంది. కర్ణాటక ప్రజలు హిమాచల్ ప్రదేశ్ ఓటర్లలా ప్రతి టర్మ్ కు అధికారాన్ని మార్చే ట్రెండ్ ఈ సారి కూడా కొనసాగించినట్లయింది. అయితే సౌత్ స్టేట్స్ టార్గెట్ గా కాషాయ పార్టీ వేసిన స్కెచ్ బెడిసికొట్టడంతో ఆ పార్టీ తదుపరి స్టెప్ ఏంటనేది ఆసక్తిగా మారింది.
Also Read...