- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆప్ ఒక్కసీటు కూడా గెలువదు.. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్
దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క సీటు కూడా గెలువదు అన్నారు. అంతకు ముందు ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కర్ణాటక అసెంబ్లీకి సంబంధించి అన్ని (224) సీట్లలో ఆప్ పోటీ చేయనుందని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తాము ఎవరితో పొత్తు పెట్టుకోమని, ఒంటరిగానే పోటీ చేస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ స్పందించారు. ‘‘కర్ణాటక ఎన్నికల్లో ఆప్ కు స్వాగతం. కానీ ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలువదు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారం చేపట్టిన ఆప్.. కర్ణాటకలో కూడా పోటీ చేయనున్నట్లు ఆప్ చీఫ్ కేజ్రవాల్ ప్రకటించారు.
ఈ క్రమంలోనే 80 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను రిలీజ్ చేశారు. అందులో డీకే శివకుమార్ బంధువు శరత్ చంద్ర ఒకరు. చెన్నపట్నం నుంచి ఆయన బరిలో దిగుతున్నారు. ఇక ఆప్ రిలీజ్ చేసిన మొదటి జాబితాలో సుప్రీంకోర్టు లాయర్ బ్రిజేశ్ కల్పన, బీబీఎంపీ అధికారి కె.మహతి, బీటీ నాగన్న, మోహన్ దాసరి, శాంతాల దామ్లే, అజయ్ గౌడ్ తదితర ప్రముఖులు ఉన్నారు. కాగా కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. మే 10న ఎన్నికలు నిర్వహించి.. మే 13న ఫలితాలు వెల్లడించనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.