వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతానన్న పవన్ కల్యాణ్.. షాక్ లో జనసేన కార్యకర్తలు!

by Javid Pasha |   ( Updated:2023-06-21 15:39:36.0  )
వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతానన్న పవన్ కల్యాణ్.. షాక్ లో జనసేన కార్యకర్తలు!
X

దిశ, వెబ్ డెస్క్: వారాహి యాత్రలో భాగంగా కోనసీమలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కీడెంచి మేలు కోరాలని తన తండ్రి తనతో చెప్పారన్న పవన్.. ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసే తాను వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈసారి మాత్రం తాను గెలవడం ఖాయమని చెప్పారు. ఒకవేళ ఓడినా తాను బాధపడనని అన్నారు. ఎన్నికల్లో గెలుపోటముల గురించి తాను పట్టించుకోనని అన్నారు. గెలిచినా ఓడినా ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఉప్మా ప్రభుత్వం నడుస్తోందని పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రాన్ని వైసీపీ నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. 6 కోట్ల మందిని 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, యువకులు, కార్మికులు, మహిళలు, మత్స్యకారులు తదితర వర్గాలకు న్యాయం చేయాలంటే తనను, తన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పవన్ కోరారు.

ఇవి కూడా చదవండి:

Breking: వైసీపీ అనేది ఉప్మా ప్రభుత్వం.. సంక్షేమ పథకాలపై పవన్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed