మెగా ఫ్యామిలీ - అల్లు ఫ్యామిలీ వేరు వేరు కాదు.. బెయిల్‌పై స్పందించిన జనసేన నేత

by Gantepaka Srikanth |
మెగా ఫ్యామిలీ - అల్లు ఫ్యామిలీ వేరు వేరు కాదు.. బెయిల్‌పై స్పందించిన జనసేన నేత
X

దిశ, వెబ్‌డెస్క్: అల్లు అర్జున్‌(Allu Arjun)కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై జనసేన(Jana Sena) నేత బొలిశెట్టి సత్యనారాయణ(Bolisetti Satyanarayana) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా(X) వేదికగా పోస్టు పెట్టారు. ‘‘ఆశించినట్టే అల్లు అర్జున్ గారికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. దేశవ్యాప్తంగా అందరిలో ఆనందోత్సాహాల వెల్లువ కనిపిస్తోంది. హైకోర్టు తీర్పు వచ్చేవరకూ వేచి చూడకుండా అల్లు అర్జున్ గారిని జైలుకు తరలించాలన్నది పోలీసుల అత్యుత్సాహంగా కనబడింది. అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్‌కు వస్తున్నట్టు మీడియాలో రెండు రోజులు ముందుగానే వచ్చింది. ఆ విషయం ప్రజలందరికీ తెలిసు. పోలీస్ కమిషనర్‌ గారు నాకు తెలియదు అనడం హాస్యాస్పదం. తగిన బందోబస్తు ఏర్పాటు చేయకుండా ఒక అమాయకురాలు చావుకు సిటీ పోలీసు కమిషనర్ భాధ్యత వహించాలి. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ రెండు కాదు ఒక్కటే.. ఈ తప్పుడు కేసు వల్ల అనేక నోర్లు మూతపడతాయి.. ఇది శుభపరిణామమే’ అని బొలిశెట్టి సత్యనారాయణ పోస్టులో పేర్కొన్నారు.

Advertisement

Next Story