Drugs in Students Lunch Box: విద్యార్ధుల లంచ్ బాక్స్‌లో డ్రగ్స్ కలకలం..

by Indraja |
Drugs in Students Lunch Box: విద్యార్ధుల లంచ్ బాక్స్‌లో డ్రగ్స్ కలకలం..
X

దిశ వెబ్ డెస్క్: డ్రగ్స్ మాపియాపై కస్టమ్స్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నా స్మగ్లర్లు మాత్రం తమ పంథా మార్చుకోవడం లేదు. డ్రగ్స్‌ను సప్లై చేసేందుకు వినూత్న రీతిలో ఆలోచిస్తున్నారు. తాజాగా చిన్న పిల్లల లంచ్ బాక్స్‌లో డ్రగ్స్‌ను సర్ఫరా చేసేందుకు యత్నించిన స్మగ్లర్‌ను అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్‌లో డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారనే సమాచారంతో క్రైమ్ బ్రాంచ్‌తో పాటు కస్టమ్స్, ఎక్సైజ్ విభాగాలు శనివారం సంయుక్త ఆపరేషన్‌‌ చేపట్టాయి.

ఈ ఆపరేషన్‌‌‌లో చిన్నారుల బొమ్మలు, చాక్లెట్లు, లంచ్ బాక్స్‌లు, క్యాండీ విటమిన్‌లలో డ్రగ్స్‌ను గుర్తించారు. కాగా ఆ విలువ రూ. 1.15 కోట్లు అని అధికారులు తెలిపారు. కాగా ఆ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఒక స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed