- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భూములను కాజేసేందుకే ‘ధరణి’: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
దిశ, అచ్చంపేట: పేద, దళిత, గిరిజన భూములను కాజేసేందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ ను ప్రవేశ పెట్టిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా జిల్లాలోని లింగాల మండలం అవుసలి కుంట సమీపంలో మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. ధరణి పోర్టల్ ప్రవేశపెట్టడంలో ప్రధాన సూత్రదారిగా వ్యవహరించిన మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ఆంధ్ర ప్రాంతానికి పనికిరారా.. ఆంధ్రకు వెళ్లి మళ్లీ తిరిగి వచ్చి రాష్ట్రంలో సీఎం ముఖ్య సలహాదారులుగా చేరడమేంటని ప్రశ్నించారు. కేవలం రాష్ట్ర సంపదను కేసీఆర్ కుటుంబానికి దోచిపెట్టేందుకే ఆయన తిరిగి వచ్చారని ఆరోపించారు.
పేదల భూములను ప్రభుత్వం లాక్కోవడంలో ప్రధాన పాత్ర సోమేశ్ కుమార్ దే అని చెప్పారు. ధరణి దేశంలోనే అతి పెద్ద భూ కుంభకోణం అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసేది తక్కువ, చెప్పుకునే గొప్పలు ఎక్కువన్నారు. ఎన్నికల ముందే బర్రెలు, గొర్రెల పథకాలు గుర్తుకు వస్తాయని, ప్రజల అవసరాలు గుర్తుకు రావని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని ప్రజలు బీఆర్ఎస్ పాలన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. భూములను కాజేసేందుకే ‘ధరణి’: సీఎల్పీ నేత భట్టి విక్రమార్కఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ నాయకులు విజయ్ కుమార్, శ్రీనివాసు, రాము, ఆధార్ లోకేష్ యాదవ్, కుందా మల్లికార్జున్, శ్రీనివాస రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.