మోడీ పాలనలో దేశం సురక్షితం: కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే

by Kalyani |   ( Updated:2023-06-26 16:08:42.0  )
మోడీ పాలనలో దేశం సురక్షితం: కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే
X

దిశ, మహబూబ్ నగర్: ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం సురక్షితంగా ఉందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే అన్నారు. సోమవారం జిల్లా కేంద్ర సమీపంలోని కోడూరు గ్రామంలో పార్టీ మండల అధ్యక్షుడు రాజుగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన జన సంపర్క అభియాన్ కార్యక్రమంలో, కేంద్ర పథకాల లబ్ధిదారుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశ రక్షణ కోసం పని చేస్తున్న మన సైనికులకు అధునాతన ఆయుధాలను ఇచ్చి వెన్నుదన్నుగా నిలిచి దేశాన్ని రక్షిస్తున్నారని, కాంగ్రెస్ పాలనలో కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్ర దాడులు జరిగేవని, ఆ దాడుల్లో మన సైనికుల తలలు నరికి పాకిస్తాన్ నుంచి మన దేశానికి మొండాలను పంపించేవారని ఆవేదన వ్యక్తం చేశారు.

నేడు మన దేశం వైపు పాకిస్తాన్ చూడాలంటేనే భయపడుతుందని అన్నారు. ప్రధాని పేదల సంక్షేమం, అభివృద్ధి, అవినీతి రహిత పాలన లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఆయన సహకారం తెలంగాణకు ఉండాలంటే మనం ప్రధాని మోడీకి మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, బురుజు రాజేందర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాకుల బాలరాజు, కృష్ణ వర్ధన్ రెడ్డి, క్రిస్టియన్ నాయక్, పి. శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : సోలాపూర్‌లో కేసీఆర్ ‘షో’.. 600 కార్లతో సినీ స్టైల్‌లో ఎంట్రీ..!

Advertisement

Next Story