Komatireddy Venkat Reddy : బర్త్ డే వేళ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Javid Pasha |   ( Updated:2023-05-23 10:17:09.0  )
Komatireddy Venkat Reddy : బర్త్ డే వేళ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: బర్త్ డే వేళ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు సీఎం పదవి అవసరం లేదని, ఆ పదవే తనను వెతుక్కుంటూ వస్తుందని అన్నారు. ఇవాళ (మే 23) కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ వద్ద ఆయన అనుచరులు బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. దాదాపు 20 వేల మందికి అన్నదానం చేశారు. ఇక అంతకు ముందు దాదాపు 500 కార్ల భారీ కాన్వాయ్ తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన అనుచరులతో కలిసి బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. అనంతరం బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ.. తాను ఏనాడు పదవుల కోసం ఆశపడలేదని, తనను వెతుక్కుంటే పదవులు వచ్చాయని తెలిపారు. తాను సీఎం పదవి కోసం పాకులాడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరనేది అధిష్టానమే నిర్ణయిస్తుందని చెప్పారు. కాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఆయనకు పొసగడం లేదని, ఆయన టీపీసీసీ చీఫ్ గా ఉన్నంత వరకు గాంధీ భవన్ కు వచ్చేదిలేదని వెంకట్ రెడ్డి తన అనుచరులతో అన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

Next Story