నాలుగేళ్ల పాలనలో జగన్ సాధించింది ఏంది?: తులసిరెడ్డి

by Javid Pasha |
నాలుగేళ్ల పాలనలో జగన్ సాధించింది ఏంది?: తులసిరెడ్డి
X

దిశ, కడప: గడచిన తొమ్మిదేళ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం సాధించిందంటూ ఏమీ లేదు విజయోత్సవ సభలు ఎందుకు నిర్వహిస్తున్నారో అర్థం కావడం లేదని కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ తులసి రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం పులివెందుల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అప్పటి మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు 13 మంది ప్రధాన మంత్రుల పరిపాలన కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు 46 లక్షల కోట్లు ఈ తొమ్మిదేళ్ల పాలనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో 109 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయని ఆయన వివరించారు. అప్పటి ప్రభుత్వాలు ఆస్తులు, సంపద వృద్ధి చేస్తే బీజేపీ ప్రభుత్వం అప్పుల కోసం, ఉన్న ఆస్తులను అమ్మడం జరుగుతుందన్నారు.

మరోవైపు పెట్రోలు, డీజిల్ , వంట గ్యాస్, నిత్యావసర సరుకుల పై ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. ఐటీ, సిబిఐ, ఈడి, లాంటి వ్యవస్థలను కూడా బ్రష్టు పట్టిస్తున్నారన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పంతా లో నడుస్తూ రాష్ట్ర ప్రజలను మరింత అప్పుల పాలు చేస్తున్నారన్నారు. అనంతరం పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పులివెందులలో అభివృద్ధి ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ప్రజల అయోమయంలో ఉన్నారన్నారు. చేసిన పనులే మరలా తవ్వి చేస్తూ ప్రజల సొమ్మును వృధా చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పనులు తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాలలో అభివృద్ధి ఏమిటో అర్థం కావడం లేదు అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపాల్రెడ్డి, మహేంద్ర, అమర్నాథ్ రెడ్డి, ఉత్తన్న, నరసింహారెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed