CM Chandra Babu: శపథాన్ని నిలుపుకున్న చంద్రబాబు.. సీఎంగా అసెంబ్లీలో అడుగు

by Indraja |
CM Chandra Babu: శపథాన్ని నిలుపుకున్న చంద్రబాబు.. సీఎంగా అసెంబ్లీలో అడుగు
X

దిశ వెబ్ డెస్క్: పోటీ ఏదైనా గెలుపు ఓటమి సహజం. గెలిచామని విర్రవీగకూడదు, ఓడిపోయామని కృంగిపోకూడదు. ముఖ్యంగా ప్రజా నాయకుడు గెలిచినప్పుడు వినమ్రంగా, ఓడినప్పుడు ధైర్యంగా, పరిస్థితి ఎలాంటిదైనా ధైర్యంగా నిలబడి తన వాళ్లను కాపాడుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రజలకు మార్గదర్శిలా ఉండాలి. అంతా అయిపోయింది అని అందరూ అనుకున్న అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పడిన చోటునుండి కెరటంలా పైకి రావాలి అని నిరూపించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నాడు భీష్మ శపథం చేసి అసెంబ్లీ నుండి బయటకు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు అన్నమాట ప్రకారం మళ్లీ నేడు సీఎంగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.

కురు సభలో నేను ఉండలేను.. అసెంబ్లీకి వస్తే మళ్లీ ముఖ్యమంత్రిగానే వస్తా..

2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లను సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి వరకు ఏ ప్రభుత్వానికి రానన్ని సీట్లు వైసీపీకి రావడంతో, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ విజయం శాశ్వతంగా ఉంటుందని భ్రమించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం అనే విషయాన్ని మర్చిపోయారు. తాను రాజ్యాంగబద్ద పదవిలో, గౌరవప్రధమైన సభలో ఉన్న విషయాన్ని విస్మరించారు.

ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన మొదటి రోజు నుండి అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిని అవమానించడమే పనిగా పెట్టుకున్నారా అనేలా జగన్ వ్యవహరించారు అనడంలో ఎలాంటి సందేహంలేదు. రాజకీయ పరిజ్ఞానంలోనూ, వయనులోనూ తన కంటే పెద్దవారేన చంద్రబాబును వైఎస్ జగన్ అదికారదర్పంతో అవమానించిన సంధర్బాలు ఎన్నో ఉన్నాయి.

ఒకానోక సమయంలో నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని నిండు సభలో వైసీపీ ఎమ్మెల్యేలు అవమానించారు. ఈ నేపథ్యంలో భావోద్వేగానికి లోనైన చంద్రబాబు ఇలాంటి కౌరవ సభలో తాను ఉండలేనని, మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని గత 2021 నవంబరు 19వ తేదీన శపథం చేసి అసెంబ్లీ నుండి బయటకు వచ్చేశారు. కాగా 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అఖండ విజయాన్ని కైవసం చేసుకుని ఆంధ్రాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రెండున్నరేళ్ల తరువాత మళ్లీ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా అడుగుపెట్టి నాడు ఆయన చేసిన శపథాన్ని నేడు నెరవేర్చు్కున్నారు.

Advertisement

Next Story

Most Viewed