'మరోసారి అధికారమిస్తే కర్ణాటకను నెంబర్ వన్ స్టేట్‌గా మారుస్తాం'

by GSrikanth |
మరోసారి అధికారమిస్తే కర్ణాటకను నెంబర్ వన్ స్టేట్‌గా మారుస్తాం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీపై విశ్వాసం ఉంచి తమకు తిరిగి అధికారం కల్పిస్తే కర్ణాటకలో అవినీతి లేకుండా చేయడంతో పాటు దక్షిణాదిలో నెంబర్ వన్ స్టేట్‌గా మారుస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా అన్నారు. గురువారం బళ్లారిలోని సండూర్‌లో జరిగిన బీజేపీ విజయ్ సంకల్ప సభలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు ఇప్పటికే సీఎం పదవి కోసం పోరాడుతున్నారని వీళ్లకు అధికారం అప్పగిస్తే ప్రజల కోసం పని చేస్తారని ఆశించలేమని ఆరోపించారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌లు వంశపారంపర్య పార్టీలని జేడీఎస్‌కు ఓటు వేస్తే అది కాంగ్రెస్‌కు వేసినట్లే అన్నారు. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మొద్దని ప్రధాని నరేంద్ర మోడీ, యడియూరప్పను నమ్మాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed